It's time for flights. విమాన రాకపోకలకు వేళాయె
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:27 AM
It's time for flights. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంలో ఈనెల 17వ తేదీ తెల్లవారితే సోమవారం నుంచి వాణిజ్యపరమైన విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. సుమారు 30 విమానాల వరకు రోజూ రాకపోకలు సాగించనున్నాయి.
విమాన రాకపోకలకు వేళాయె
భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభం కానున్న ఎయిర్‌బస్ సేవలు
స్థానికులకు కనువిందు చేయనున్న విమానాలు
విజయనగరం, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి):
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంలో ఈనెల 17వ తేదీ తెల్లవారితే సోమవారం నుంచి వాణిజ్యపరమైన విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. సుమారు 30 విమానాల వరకు రోజూ రాకపోకలు సాగించనున్నాయి. భోగాపురం నుంచి హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ముంబై, తిరుపతి ప్రాంతాలతో పాటు విదేశాలైన సింగపూర్, అబుదాబీ వంటి ప్రాంతాలకు విమాన ప్రయాణం చేయవచ్చు. అంచెలంచెలుగా మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు పెరగనున్నాయి. ఇదిలా ఉండగా భోగాపురం ఎయిర్‌పోర్టులో ట్రయల్‌రన్ నిర్వహించినప్పటి నుంచే కొన్ని విమానాల రాకపోకలు సాగుతున్నాయి. ఈనెల 1న ప్రధాని నరేంద్రమోదీ ఎయిర్ పోర్టు ప్రారంభించిన తరువాత సుమారు 10 వరకు విమానాలు వచ్చి వెళ్లాయి. అయితే ఈనెల 16న అర్ధరాత్రి తరువాత పూర్తి స్థాయిలో అధికారికంగా విమానాలు రాకపోకలు సాగించనున్నట్లు ఏవీయేన్ శాఖ ఇప్పటికే ప్రకటించింది. విశాఖ నుంచి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రతి అరగంటకు ఒక ఎలక్ట్రిక్ బస్సును ఏర్పాటు చేశారు. ట్రయల్‌రన్ కూడా నిర్వహించారు.
ఫ ఇప్పటికే భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు జాతీయ రహదారి-16తో అనుసంధానంగా అప్రోచ్ రోడ్లను నిర్మించారు. అలాగే పెందుర్తి, జేవీ ఆగ్రహారం నుంచి తాళ్లవలస, కొమ్మాది నుంచి బొయపాలెం మీదుగా కాపులుప్పాడ, మంగమారిపేటకు అనుసందానంగా ఉన్న తిమ్మాపురం రహదారికి ఎయిర్‌పోర్టు రోడ్డుతో కనెక్టవిటీ ఉంది. దీంతో ఎయిర్‌పోర్టుకు వచ్చే ప్రయాణికులు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.