It's time for degree admissions. డిగ్రీ ప్రవేశాలకు వేళాయె
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:59 PM
It's time for degree admissions. ఇంటర్మీడియట్ తరువాత ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపే చదువు డిగ్రీ. బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఎం వంటి కోర్సుల్లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఏడాది ప్రవేశాలకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ఆలస్యమైంది.
డిగ్రీ ప్రవేశాలకు వేళాయె
నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
ఏయూ పరిధిలో 70 కాలేజీలు
జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 4, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 66
జిల్లా వ్యాప్తంగా 40 వేల సీట్లు
తగ్గుతున్న ప్రవేశాలు
ఇంజనీరింగ్ వైపు మక్కువ
విజయనగరం, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి):
ఇంటర్మీడియట్ తరువాత ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపే చదువు డిగ్రీ. బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఎం వంటి కోర్సుల్లో చేరేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఏడాది ప్రవేశాలకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడం ఆలస్యమైంది. ఉన్నత విద్యాశాఖ తాజాగా డిగ్రీ ప్రవేశాల అన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూడ్ విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 11వరకు రిజిస్ట్రేషన్, 20లోపు సర్టిఫికెట్ల పరిశీలన, 15 నుంచి 19 మధ్య వెబ్‌ఆప్షన్ల నమోదు, 20న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఇచ్చారు. 26న సీట్ల కేటాయింపు ఉంటుంది. 27 నుంచి షెడ్యూల్ మేరకు తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లా విద్యార్థులు డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ సీబీజెడ్ వంటి గ్రూపులకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు కామర్స్, ఆర్ట్స్ గ్రూపులకు సంబంధించి బీఏ(హెచ్‌ఈపీ), బి.కం, ఒకేషనల్ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు.
ఫ గత కొన్నేళ్లగా అడ్మిషన్లు లేనివి, స్టాఫ్ ర్యాటిఫికేషన్ లోపాలు ఉన్న కాలేజీలకు అడ్మిషన్లకు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో 4 ప్రభుత్వ, 66 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మహారాజ డిగ్రీ కాలేజీకి గతంలో మంచి ప్రాధాన్యత ఉండేది. అన్ని డిగ్రీ కాలేజీల్లో 40 వేల వరకు సీట్లు ఉన్నాయి. 50 శాతం సీట్లు మాత్రమే నిండుతున్నాయి. ప్రధానంగా క్యాంపస్ సెలక్షన్‌లు చేపట్టే కాలేజీలకు ఆదరణ ఉంది. జిల్లా కేంద్రంలో నాలుగైదు కాలేజీలు ఈ కోవలో ఉన్నాయి. ఈ ఏడాది సైతం 20 వేల నుంచి 22 వేల మధ్య ప్రవేశాలు ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. గజపతినగరం, చీపురుపల్లి, ఎస్.కోట, విజయనగరం ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు లభిస్తాయి. విద్యార్థులు కళాశాలలో చేరేముందు సీనియర్ విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఉండవు. ఎక్కువ మంది విద్యార్ధులు ఇంజనీరింగ్ వైపు మొగ్గుచూపడం వల్ల డిగ్రీ ప్రవేశాలు తగ్గుతున్నాయి.
------------------