Share News

నిధులున్నా పనులు చేయట్లే!

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:09 AM

మండలంలోని పలు రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధు లు మంజూరు చేసింది. కానీ, ఆ పనులు మా త్రం జరగడం లేదు.

 నిధులున్నా పనులు చేయట్లే!
అభివృద్ధికి నోచుకోని వీలుపర్తి-కడకొండ రోడ్డు

- రహదారుల నిర్మాణంపై నిర్లక్ష్యం

- ప్రజలకు తప్పని ఇబ్బందులు

వేపాడ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని పలు రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధు లు మంజూరు చేసింది. కానీ, ఆ పనులు మా త్రం జరగడం లేదు. దీంతో ప్రజలకు ఇబ్బం దులు తప్పడం లేదు. వీలుపర్తి నుంచి కొలు కుపాలెం, పెదదుంగాడ, చినదుంగాడ మీదుగా కడకొండ గ్రామం వరకు తారురోడ్డు నిర్మాణా నికి రూ.2.75కోట్లు, బొద్దాం నుంచి ఓబలయ్య పాలెం, ముకుందపురం మీదుగా కళ్లెంపూడి వరకు రహదారి నిర్మాణానికి రూ.1.74కోట్లు, బానాది-ఆతవ రోడ్డుకు రూ.2.60కోట్లు, జగ్గయ్య పేట-కొత్తసింగరాయి రోడ్డు నిర్మాణానికి రూ.74 లక్షలు మంజూర య్యాయి. అయితే, ఈ పనులను ప్రారంభించ కపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు బాగోలేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నామని, ఇప్పటికైనా పనులు ప్రారంభించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 12:09 AM