Share News

It's a battle now. ఇక సమరమే

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:04 AM

It's a battle now. ‘స్థానిక’ పోరు మొదలుకానుంది. ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది. బీసీలకు అన్నిరంగాల్లో ప్రాధాన్యం ఇస్తామని ఇచ్చిన హామీ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకున్న విషయం తెలిసిందే.

It's a battle now. ఇక సమరమే

ఇక సమరమే

స్థానిక ఎన్నికల నిర్వాహణకు తొలగిన అడ్డంకులు

సుప్రీంకోర్టు ఆదేశాలతో ముందుకు వెళ్లనున్న ప్రభుత్వం

ఓటర్ల జాబితా తయారీపై తక్షణం దృష్టి

నూతన జాబితాతో ఎన్నికలకు ప్రయత్నం

పూర్తి కాకుంటే పాత జాబితాతోనే స్థానిక పోరు

విజయనగరం, అక్టోబరు9 (ఆంధ్రజ్యోతి):

‘స్థానిక’ పోరు మొదలుకానుంది. ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది. బీసీలకు అన్నిరంగాల్లో ప్రాధాన్యం ఇస్తామని ఇచ్చిన హామీ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకున్న విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానాల్లో అడ్డంకులు రావడంతో వాటి సలహాతోనే మున్ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ‘‘సర్‌’’ ప్రక్రియ సకాలంలో పూర్తి అయితే నూతన జాబితాతోనూ, కాకుంటే పాత ఓటర్ల జాబితాతోనూ ఎన్నికలు పూర్తి చెయ్యాలని శుక్రవారం సుప్రీంకోర్టు సూచించింది. వార్డుల విభజన తదితర అంశాలపై వైసీపీ వేసిన పిటిషన్లు, బీసీలకు 34శాతం రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం వేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. అదే సమయంలో ఎన్నికల నిర్వహణపై ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగంగా ఎన్నికలకు సన్నాహాలు చేయనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఏస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ కేంద్రాల పరిశీలన, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర వనరుల ఏర్పాటు, బ్యాలెట్‌ బాక్సుల భద్రత తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

- వాస్తవానికి జిల్లాలో బీసీ సామాజిక వర్గమే ఎక్కువ. అన్ని పార్టీల్లోనూ బీసీ కులాలకు చెందిన నాయకులే కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీ సామాజిక వర్గానికి మద్దతు ఇచ్చేందుకు టీడీపీ 34 శాతం రిజర్వేషన్‌ అమలుకు ప్రయత్నిస్తోంది.

- జిల్లాలో 27 మండలాలు, 777 పంచాయతీలు ఉన్నాయి. నగరపాలక సంస్థతో పాటు 2 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉంది. అదే సమయంలో 27 జడ్పీటీసీలు, 549 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో పాత ఓటర్ల జాబితా ప్రకారం 14, 51,072 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,16,817 మంది పురుషులు, 7,34,518 మంది మహిళా ఉండగా 61 మంది ట్రాన్స్‌జండర్‌లు ఉన్నారు.

బీసీలకు అండగా ప్రభుత్వం: మంత్రి కొండపల్లి

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అమలుపై అడ్డంకులు వచ్చినప్పటికీ ఇది కేవలం తాత్కాలిక విరామమేనని, భవిష్యత్‌లో బీసీలకు అన్ని విధాలా మేలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం గజపతినగరంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు అయన హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు ఇచ్చిన హామీల్లో ఎక్కడా వెనుకడుగు వేసే ఆలోచన లేదన్నారు. ఆ దిశగా ఆయన అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

Updated Date - Oct 10 , 2026 | 12:04 AM