కురిసింది వాన
ABN , Publish Date - Mar 20 , 2026 | 12:28 AM
జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం వర్షం కురిసింది.
పార్వతీపురం/టౌన్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం వర్షం కురిసింది. పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, వీరఘట్టం, భామిని తదితర మండలాల్లో ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షం సుమారు రెండు గంటల పాటు కురిసింది. పార్వతీపురంలో ప్రధాన రహదారితో పాటు పలుకూడళ్లు జలమయమయ్యాయి. ఉగాది పర్వదినాన వాన పడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం తమ పంటలు బాగుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షంతో జీడి, మామిడి, వరి, మొక్కజొన్న పంటలకు మేలు కలుగుతుందని, వేసవి దుక్కులకు పలు చోట్ల అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కాగా, మూడు నెలలుగా వర్షాలు లేకపోవడం.. గత 15 రోజులుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.