వారు మహిళల రక్షణ కోసం నిరసన చేపట్టడం హాస్యాస్పదం
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:23 AM
వైసీపీ హయాంలో మహిళలపై అత్యాచారా లు, దాడులు, హత్యలు ఇలా ఎన్నో సంఘటన లు జరిగాయి.. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మహిళా విభాగం వారు మహిళల రక్షణ కోసం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
విజయ నగరం రూర ల్, జూలై 23(ఆంధ్రజ్యో తి): వైసీపీ హయాంలో మహిళలపై అత్యాచారా లు, దాడులు, హత్యలు ఇలా ఎన్నో సంఘటన లు జరిగాయి.. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన మహిళా విభాగం వారు మహిళల రక్షణ కోసం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఎద్దేవా చేశారు. తెలుగు మహిళా విభాగం నేతలతో కలిసి ఆమె గురువారం విజయనగరంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ హయాంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దిశా చట్టం అని చెప్పి, లేని చట్టాన్ని ఉన్నట్టుగా చూపించి మహిళలను మోసం చేసిన ఘనత వైసీపీ వారిదేనన్నారు. అమరావతి రైతుల పట్ల వైసీపీ చేసిన అసభ్య కర వ్యాఖ్యలు, మహిళలను హింసించిన తీరు సభ్య సమాజానికి సిగ్గుచేటన్నారు. మహిళా సాధికారితకు చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని చెప్పారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని నిర్ణయం తీసుకోవడం చూస్తే మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మహిళా విభాగం నాయకులు అనురాధ బేగం, కర్రోతు రాధామణి, మద్ధాల నాగకుమారి తదిత రులు పాల్గొన్నారు.