Share News

గాంధీ పేరును తొలగించడం తగదు

ABN , Publish Date - Jan 11 , 2026 | 12:03 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరును తొలగించడం తగదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు వి.దాలినాయుడు పేర్కొన్నారు.

 గాంధీ పేరును తొలగించడం తగదు
గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు:

బెలగాం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి బీజేపీ ప్రభుత్వం గాంధీ పేరును తొలగించడం తగదని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు వి.దాలినాయుడు పేర్కొన్నారు. శని వారం పార్వతీపురం పట్ణణ నాలుగు రోడ్ల జంక్షన్ల గల గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులతో కలిసి ఎన్‌ఆర్‌జీఎస్‌ బచావో సంగ్రామ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాలినాయుడు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 26వ వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

Updated Date - Jan 11 , 2026 | 12:03 AM