Share News

అర్జీదారులను తిప్పడం సరికాదు

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:22 AM

నిబంధనలకు అనుగుణంగా పరిష్కారానికి అవకాశం లేని వినతులు వస్తే అర్జీదారులకు తెలియజేయాలని, వారిని పదేపదే కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిప్పడం సరికాదని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్నారు.

అర్జీదారులను తిప్పడం సరికాదు
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

గంట్యాడ సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): నిబంధనలకు అనుగుణంగా పరిష్కారానికి అవకాశం లేని వినతులు వస్తే అర్జీదారులకు తెలియజేయాలని, వారిని పదేపదే కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిప్పడం సరికాదని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కొటారుబిల్లిలో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. వివిధ సమస్యలపై 82 వినతులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు నియోజకవర్గాల్లో పీజీఆర్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం పోర్టుకో వద్ద నిరీక్షిస్తున్న కిర్తుబర్తి గ్రామానికి చెందిన దివ్యాంగుడు రఘమండ రమణ వద్దకు వెళ్లి కలెక్టర్‌ వినతి స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్‌వో చందక సత్తిబాబు, ఆర్డీవో సనపాల సుధాసాగర్‌, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ అరుణకుమారి, గంట్యాడ , బొండపల్లి, గజపతినగరం, దత్తిరాజేరు తహసీల్దార్లు అధికారులు పాల్గొన్నారు.

- గంట్యాడ జిల్లా పరిషత్‌ పాఠశాలలో నిర్వహించిన స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. భవిష్యత్‌ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో డీఈవో యు.మాణిక్యంనాయుడు, డీపీవో మల్లికార్జునరావు, ఎంపీడీవో రమణమూర్తి,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అలమండ ఝూన్సీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:22 AM