Share News

బీసీల సంక్షేమంపై మాట్లాడడం హాస్యాస్పదం

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:19 AM

రాష్ట్రాభివృద్ధి, బీసీల సంక్షేమంపై వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్ప దమని రాజ్యసభ సభ్యుడు, స్థానిక ఎన్నికల విజయనగరం జిల్లా పరిశీలకుడు చింతకాయల విజయ్‌ అన్నారు.

 బీసీల సంక్షేమంపై మాట్లాడడం హాస్యాస్పదం

  • రాజ్యసభ సభ్యుడు విజయ్‌

విజయనగరం/ విజయనగరం రూరల్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధి, బీసీల సంక్షేమంపై వైసీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్ప దమని రాజ్యసభ సభ్యుడు, స్థానిక ఎన్నికల విజయనగరం జిల్లా పరిశీలకుడు చింతకాయల విజయ్‌ అన్నారు. సోమ వారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగార్జునతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమనంలోకి వెళ్లిందన్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుపైన, తనపైన, టీడీపీ సీనియర్‌ బీసీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కూటమి పార్టీల సమన్వయం తోనే స్థానిక ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో ముందుకు దూసుకువెళ్తామన్నారు. టీడీపీ నాయకులు కిమిడి రామల్లిక్‌ నాయుడు, గంటా రవి, అవనాపు విజయ్‌, పీతల కోదండరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 12:19 AM