Share News

ఈ నేలపై పుట్టడం అదృష్టం

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:15 AM

వ్యవహారిక భాషపై పట్టు సాధించిన గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి వంటి మహనీయులు పుట్టిన నేలపై పుట్టడం మన అదృష్టమని కేంద్ర సాహి త్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మభూషణ్‌ యార్లగ డ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు.

ఈ నేలపై పుట్టడం అదృష్టం

  • పద్మభూషణ్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌

  • ఘనంగా ఉత్తరాంధ్ర మహిళా సదస్సు

విజయనగరం కల్చరల్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): వ్యవహారిక భాషపై పట్టు సాధించిన గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి వంటి మహనీయులు పుట్టిన నేలపై పుట్టడం మన అదృష్టమని కేంద్ర సాహి త్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మభూషణ్‌ యార్లగ డ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. ఆదివారం స్థానిక క్షత్రియ కల్యాణ మండపంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సం ఘం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మహిళా సదస్సు ఘనం గా నిర్వహించారు. ఈ సదస్సులో ఆయనతో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొని.. జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ సారస్వ త పరిషత్‌ అధ్యక్షుడు డా.గజల్‌ శ్రీనివాస్‌తో పాటు వివిధ ప్రాంతాలకు, చెందిన ప్రముఖ కవులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంత రం కవితల పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయనగరం విద్య, క్రీడలు, కళలకు పేరొందిందని, ఈ ప్రాంతంలో ఈ సదస్సు నిర్వహిం చడం అభినందనీయమన్నారు. అనంతరం కవితల్లో, ప్రసంగాల్లో ప్రతిభాపాటవాలను ప్రదర్శించిన చిన్నారు లను అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షురా లు ఏళ్ల అరుణతో పాటు పలువురు పట్టణ ప్రముఖు లు, రచయితలు, సాహితీవేత్తలు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం-మన్యం జిల్లాలకు చెందిన పలువురు రచయితలు పాల్గొన్నారు. కవనపు గీతాలు, ఉపాధ్యాయుల స్ఫూర్తి, నా అక్షరాలు తదితర పుస్తకాల ను ఆవిష్కరించారు.

Updated Date - Mar 30 , 2026 | 12:15 AM