Share News

ఉత్తమ ఉద్యోగి ఒక్కరూ లేరా?

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:17 AM

పార్వతీపురం మునిసిపాలిటీకి చెందిన ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఉత్తమ అవార్డులకు ఎంపిక చేయలేదు.

ఉత్తమ ఉద్యోగి ఒక్కరూ లేరా?
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం ఇదే..

పార్వతీపురం టౌన్‌, జనవరి27 (ఆంధ్ర జ్యోతి): పార్వతీపురం మునిసిపాలిటీకి చెందిన ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఉత్తమ అవార్డులకు ఎంపిక చేయలేదు. దీంతో స్థానిక మునిసిపాలిటీలో నిబద్ధతతో విధులు నిర్వర్తిం చే ఉద్యోగి ఒక్కరూ లేరా అనే ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఈ విషయం పట్టణంలో చర్చనీయాంశమైంది. పార్వతీపురం మునిసి పాలిటీ ఏర్పడి 63 ఏళ్లు కావస్తోంది. మున్సి పాల్టీ పాలనలో ఐదు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు పట్టణాభివృద్ధిలో కీలక భాగస్వాములుగా ఉంటున్నారు. ప్రస్తుతం స్థాని క మునిసిపాలిటీలో అన్ని విభాగాలకు చెందిన పర్మినెంట్‌ ఉద్యోగులు 66 మంది ఉన్నారు. ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకల్లో పలువురు అధికారులు, ఉద్యోగులు.. జిల్లా మం త్రులు, కలెక్టర్ల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకునేవారు. అయితే ఈ ఏడాది జిల్లా కేంద్రంలో నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకల్లో పార్వతీపురం మునిసిపాలిటీ నుంచి ఒక్క అధికారికి గానీ, ఉద్యోగికి గానీ ఉత్తమ అవార్డు ప్రదానం చేయలేదు. స్థానిక మునిసి పాలిటీ కార్యాలయంలోని ఇంజనీరింగ్‌, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్యం విభాగాల్లో తమ ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు, ఉద్యో గులకు ఏటా ప్రశంసాపత్రాలు అందేవి. అయి తే ఈ ఏడాది ఎందుకు వారు అందుకోలేదనేది బేతాళ ప్రశ్నగా మిగిలింది. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ పావని వివరణ కోరగా.. నేను బాద్యతలు చేపట్టి నెలరోజులు కాకపోవడంతో ఆయా విభాగాల అధికారుల పనితీరుపై అంచనా వేయకపోవడం వల్ల ఉత్తమ అధికారులు, ఉద్యోగుల పేర్లు సిఫారుసు చేయలేదన్నారు.

Updated Date - Jan 28 , 2026 | 12:17 AM