స్ట్రాంగ్ రూమ్‌లు ఇలాగేనా ఉండేది?
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:11 AM
బొబ్బిలి ము న్సిపాలిటీకి సంబంధించి స్థానిక ఏపీఐఐసీ గ్రోత్ సెం టరులో ఆర్డీవో కార్యాలయం దిగువన ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్, బ్యాలెట్ బాక్స్‌ల పంపిణీ గదులు, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని రామ్సుందర్రెడ్డి శనివారం పరిశీలించారు.
కలెక్టర్ రామ్సుందరరెడ్డి అసంతృప్తి
అత్యవసరంగా మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశం
బొబ్బిలి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి ము న్సిపాలిటీకి సంబంధించి స్థానిక ఏపీఐఐసీ గ్రోత్ సెం టరులో ఆర్డీవో కార్యాలయం దిగువన ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్, బ్యాలెట్ బాక్స్‌ల పంపిణీ గదులు, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని రామ్సుందర్రెడ్డి శనివారం పరి శీలించారు. భవనంపైన డూమ్ పూర్తిగా శిథిలం కావడం, ముందు భాగమంతా బురదతో పేరుకు పోవడాన్ని గమనించారు. సంబంధిత గదుల పరిస రాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు ఇలాగేనా ఉండేది? అని అధికారులను ప్రశ్నించారు. ప్రత్యామ్నాయంగా ఏవైనా మంచి భవనాలు ఉంటే పరిశీలించాలని, వెంటనే అక్కడికి మార్చాలని ఆర్డీవో జేవీఎస్ఎస్ రామ్మోహనరావును, మున్సిపల్ కమిషన ర్ లాలం రామలక్ష్మిని ఆదేశించారు. ఈ మేరకు పట్ట ణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలను అధి కారులు వెంటనే పరిశీలించారు. ఏ భవనం కూడా సౌకర్యవంతంగా లేకపోవడంతో గ్రోత్‌సెంటర్‌లోని భవ నాలనే బాగు చేయాలని, అవసరమైన ఏర్పాట్లు చే యాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్చార్జి తహసీల్దార్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.