Share News

Is the Food Tasty? భోజనం రుచిగా ఉందా?

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:11 PM

Is the Food Tasty? భోజనం రుచిగా ఉందా? మెనూ అమలు ఎలా ఉంది! అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ గిరిజన విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నతపాఠశాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థినుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Is the Food Tasty?  భోజనం రుచిగా ఉందా?
ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో ముచ్చటిస్తున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో

  • గిరిజన విద్యార్థినులతో ఇన్‌చార్జి పీవో

సీతంపేట, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): భోజనం రుచిగా ఉందా? మెనూ అమలు ఎలా ఉంది! అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ గిరిజన విద్యార్థులను అడిగి తెలుసు కున్నారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నతపాఠశాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన విద్యార్థినుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ అమలు, వారి ఆరోగ్యం, పరిరక్షణ తదితర అంశాలపై ఆరా తీశారు. బాలికలకు పోష కాహారం సక్రమంగా అందించాలని హెచ్‌ఎం వసంత, హెచ్‌డబ్ల్యూవో అమలను ఆదేశించారు. పాఠశాల పరిసరాలతో పాటు వంటగది, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థినులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెనూ పక్కాగా అమలుచేసి, రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన పాలిటెక్నిక్‌ కళాశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యనభ్యసించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు కళాశాలలో సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పీవో హామీ ఇచ్చారు. ఆయన వెంట ఏపీవో చిన్నబాబు ఉన్నారు.

8న ‘ట్రైబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ చాలెంజ్‌’

గిరిజన యువతను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ నెల 8న ఐటీడీఏ ట్రైబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ చాలెంజ్‌ 2026 కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినూత్న వ్యాపార ఆలోచనలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ రజిని హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గురువారం ఉదయం 10గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో సదస్సు ప్రారంభమవుతుందన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:11 PM