Share News

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:12 AM

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం తగదని చిన్నయ్యపేటకు చెందిన ఉపాధి వేతనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా?

  • చెరువుల్లోకి కలుషిత జలం

  • చిన్నయ్యపేటలో ఉపాధి వేతనదారుల ఆందోళన

రేగిడి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడడం తగదని చిన్నయ్యపేటకు చెందిన ఉపాధి వేతనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంకిలి ఈఐడీ షుగర్స్‌ అనుబంధ డిస్టలరీ ప్లాంట్‌కు దగ్గరలో ఉన్న చెరువులో ఉపాధి పని కోసం మంగళ వారం వెళ్లిన చిన్నయ్యపేట వేతనదారులు.. ఈ చెరు వులో కలుషిత జలాలు చూసి, అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ జలం పనులకు అడ్డంకి కావటంతో చెరు వు గట్టుపై నిరసన వ్యక్తం చేశారు. ఈఐడీ సంస్థల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు మొక్కుబడి తని ఖీలు నిర్వహించారని వారు విమర్శించారు. చెరకు ఫ్యాక్టరీ పేరుతో తమ విలువైన భూ ములు సేకరించి, కెమికల్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారన్నారు. చెరువులను నాశనం చేసి, తమ ఆరోగ్యాలను పాడు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కలుషిత జలాల వల్ల చిన్నయ్యపేట, సంకిలి గ్రామాల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతోందని వారు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసు కోవాలని వీరు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 08 , 2026 | 12:12 AM