Everything Correct? అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా?
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:22 AM
Is Everything Correct? మార్కాపురం బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో పట్టణ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా వాహన తనిఖీలు చేపడు తున్నారు. శుక్రవారం పోలీసు, రవాణా, అగ్నిమాపక శాఖ అధికారులు ఉమ్మడిగా సాలూరు బైపాస్‌రోడ్డు వద్ద 14 వాహనాలను పరిశీలించారు.
సాలూరు బైపాస్ రోడ్డులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీ
ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా చర్యలు
సాలూరు, మార్చి27(ఆంధ్రజ్యోతి): మార్కాపురం బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో పట్టణ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా వాహన తనిఖీలు చేపడు తున్నారు. శుక్రవారం పోలీసు, రవాణా, అగ్నిమాపక శాఖ అధికారులు ఉమ్మడిగా సాలూరు బైపాస్‌రోడ్డు వద్ద 14 వాహనాలను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి పర్మిట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ పత్రాలతోపాటు డ్రైవర్ల లైసెన్సులను తనిఖీ చేశారు. ప్రధానంగా అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలు ఉన్నాయా? లేదా! అని ఆరా తీశారు. అత్యవసర ద్వారాలు ఎలా పనిచేస్తున్నాయో పరిశీలించారు. బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అక్రమంగా సరుకు రవాణా చేయడం వంటి అంశాలపై అధికారులు నిఘా పెట్టారు. నిబంధనలు అతిక్రమించే ట్రావెల్స్ యాజ మాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాశాఖాధికారి దుర్గాప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడేలా వ్యవహరిస్తే వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. నిరంతరం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.