Share News

Irrigation Water పైప్‌లైన్‌ ద్వారా సాగునీరు

ABN , Publish Date - May 19 , 2026 | 12:13 AM

Irrigation Water Through Pipeline జలశక్తి పఽథకం ద్వారా పైప్‌లైన్‌ ద్వారా నేరుగా పంటలకు సాగునీరు అందిస్తామని జాయింట్‌ కమిషనర్‌ అంబ్లి తెలిపారు. పెద్దగెడ్డ ఆధునికీ కరణ పనులపై సోమవారం సాలూరులోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు.

Irrigation Water  పైప్‌లైన్‌ ద్వారా సాగునీరు
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కమిషనర్‌

మక్కువ రూల్‌(సాలూరు)మే18(ఆంధ్రజ్యోతి): జలశక్తి పఽథకం ద్వారా పైప్‌లైన్‌ ద్వారా నేరుగా పంటలకు సాగునీరు అందిస్తామని జాయింట్‌ కమిషనర్‌ అంబ్లి తెలిపారు. పెద్దగెడ్డ ఆధునికీ కరణ పనులపై సోమవారం సాలూరులోని ఒక ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. పెద్దగెడ్డ ఆధునికీకరణకు రూ.67 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇకపై ఆ ప్రాజెక్టు పరిధిలో రైతుల పంటపొలాలకు పైపులైన్‌ ద్వారా సాగునీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని నీటిపారుదల శాఖ అధికా రులను ఆదేశించారు. కాలువల ద్వారా సాగు నీటి సరఫరాలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. దీనిలో భాగంగా జలశక్తి పథకాన్ని అమలు చేస్తోందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బొబ్బిలి నీటిపారుదల శాఖ ఎస్‌ఈ అప్పారావు, సాలూరు ఏఎంసీ చైర్మన్‌ ఎం.సూర్యనారాయణ , పెద్దగెడ్డ నీటి సంఘం వైస్‌ చైర్మన్‌ బలరాం, డీఈ ది.సురేష్‌, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2026 | 12:13 AM