Share News

Irrigation శివారు భూములకూ నీరందించడమే లక్ష్యం

ABN , Publish Date - Jul 19 , 2026 | 12:22 AM

Irrigation for Outlying Farmlands Is the Goal శివారు భూములకూ నీరందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక పెద్దగెడ్డ జలాశయం నుంచి సాగునీరు విడుదల చేశారు.

Irrigation  శివారు భూములకూ నీరందించడమే లక్ష్యం
నీరు విడుదల చేస్తున్న దృశ్యం

  • పెద్దగెడ్డ నుంచి నీరు విడుదల

పాచిపెంట రూరల్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): శివారు భూములకూ నీరందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక పెద్దగెడ్డ జలాశయం నుంచి సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నుంచి 12,500 ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు తెలి పారు. కాగా ఖరీఫ్‌ రైతులు ఈ సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గ పరిధిలో పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్‌, ఆండ్ర జలాశయాలు ఉండడం రైతులు అదృష్టంగా భావించాలన్నారు. గత ప్రభుత్వం పెద్దగెడ్డ జలాశయం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నదుల అనుసంధానంతో పాటు జలాశయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. పెద్దగెడ్డ కాలువల్లో పూడికతీత, జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి అభివృద్ధి పనులకు రూ.75 లక్షలు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పరిధిలో సాలూరు, బొబ్బిలి మున్సిపాలిటీలకు తాగునీటిని అందించేందుకు మరో రూ.వంద కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో పెద్దగెడ్డ జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 213.80 మీటర్లు కాగా ప్రస్తుతం 210.50 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయని డీఈ శ్రీనివాసరావు తెలిపారు. ఖరీఫ్‌ రైతుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 50 క్యూసెక్కులను విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఏఎంసీ చైర్మన్‌ సూర్యనారాయణ, పెద్దగెడ్డ నీటిపారుదల సంఘం అధ్యక్షుడు గంగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2026 | 12:22 AM