Share News

భూగర్భ జలాలతో సాగునీటి సౌకర్యం

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:58 PM

చెరువు అభివృద్ధితో నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగు నీటి సౌకర్యం మెరుగుపడుతుందని పాల కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపా రు.

భూగర్భ జలాలతో సాగునీటి సౌకర్యం
పనులను పరిశీలిస్తున్న జయకృష్ణ:

వీరఘట్టం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): చెరువు అభివృద్ధితో నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగు నీటి సౌకర్యం మెరుగుపడుతుందని పాల కొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపా రు. మంగళవారం వీరఘట్టం పంచాయ తీలోని ఉపాధిహామీ పథకం ద్వారా రూ. 50లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. నాణ్యతలో రాజీ లేకుండా పూర్తి చేయాలని సూచించారు.

Updated Date - Aug 04 , 2026 | 11:59 PM