Share News

Road Construction రోడ్డు నిర్మాణాల్లో అవకతవకలు

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:10 PM

Irregularities in Road Construction రిటైర్డ్‌ పంచాయతీ ఈఈ విధి నిర్వహణలో అలసత్వం వహించారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. ఆయన పెన్షన్‌లో 5 శాతం శాశ్వత కోత విధిస్తూ జీవో జారీ చేసింది.

  Road Construction రోడ్డు నిర్మాణాల్లో అవకతవకలు
పాలకొండలో పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ కార్యాలయం

  • విచారణలో పాక్షికంగా రుజువు

  • పెన్షన్‌లో 5 శాతం కోత

పాలకొండ, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్‌ పంచాయతీ ఈఈ విధి నిర్వహణలో అలసత్వం వహించారన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. ఆయన పెన్షన్‌లో 5 శాతం శాశ్వత కోత విధిస్తూ జీవో జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 2019-2020లో ఏడు నెలలు పాటు పాలకొండ పంచాయతీరాజ్‌శాఖలో ఈఈగా జి.వి.బి.రామారావు పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. అయితే ఆ సమయంలో సీతంపేట మండలం సిరికొండ, ఒప్పంగి,ఎగువ దొంబంగివలస వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణాల్లో ఆయన అవకతవకలకు పాల్పడినట్టు విచారణలో పాక్షికంగా రుజువైంది. నాణ్యతా లోపాలున్నా, అంచనాలకు తగ్గట్టుగా పనులు జరగకపోయినా ఆయన సరిగా తనిఖీ చేయకపోవడం, నాసిరకం పనులకు సైతం బిల్లులు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా లేబర్‌ కాంపోనెంట్‌పై 25 శాతం ఏజెన్సీ ఏరియా అలవెన్స్‌ మంజూరు చేయడం వంటి అభియోగాలను ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలపై విచారణ నివేదికలు, ఆయన ఇచ్చిన వివరాలను పరిశీలించిన అనంతరం ఏపీ రివైజ్డ్‌ పెన్షన్‌ రూరల్స్‌-1980లోని రూల్‌ 9 ప్రకారం పెన్షన్‌లో ఐదు శాతాన్ని శాశ్వతంగా నిలిపివేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Oct 05 , 2026 | 11:10 PM