Iron Grip on Narcotics మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - May 26 , 2026 | 11:44 PM
Iron Grip on Narcotics జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు సేఫ్టీపై జిల్లా అధికారులు, కమిటీతో వర్చువల్‌గా సమీక్షించారు.
పార్వతీపురం, మే26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు సేఫ్టీపై జిల్లా అధికారులు, కమిటీతో వర్చువల్‌గా సమీక్షించారు. మత్తు పదార్థాల నివారణకు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆయన సూచించారు. అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలన్నారు. ఇందుకోసం పోలీస్, ఫారెస్ట్, ఎక్సైజ్, శాఖలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాలన్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో నెలకొకసారి మహిళా పోలీసులతో ర్యాలీ నిర్వహించాలన్నారు. ఈ వర్చువల్ మీటింగ్‌లో ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.