పిల్లల ఎదుగుదలకు అయోడిన్ అవసరం’
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:07 AM
పిల్లల శారీరక, మానసిక ఎదుగు దలకు అయోడిన్ ఎంతో అవసరమని జిల్లా ఎన్‌సీడీ పీవో డాక్టర్ టి. జగన్మోహన్‌రావు తెలిపారు.
‘కొమరాడ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): పిల్లల శారీరక, మానసిక ఎదుగు దలకు అయోడిన్ ఎంతో అవసరమని జిల్లా ఎన్‌సీడీ పీవో డాక్టర్ టి. జగన్మోహన్‌రావు తెలిపారు. అయోడిన్ లోప రుగ్మతల నివారణ వారోత్సవంలో భాగంగా సోమవారం విక్రంపురం ఉన్నత పాఠ శాలను ఆయన సందర్శించారు. విద్యార్థులకు అయోడిన్ ప్రాముఖ్యతను వివరించారు. అయోడిన్ లోపంతో ఎదుగు దల మందగించడం, బుద్దిమాంధ్యం, గర్భస్థ శిశువు అభివృద్ధిలో లోపాలు, పెద్దల్లో గాయిటర్ సమస్యలు వస్తాయన్నారు. వీటి నివారణకు అయోడిన్ కలిగిన ఉప్పును వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గౌరీశంకరరావు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.