Share News

Iodine deficiency అయోడిన్‌ లోపాన్ని నివారించాలి

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:11 AM

Iodine deficiency must be prevented. జిల్లావాసుల్లో అయోడిన్‌ లోపం నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. గ్లోబల్‌ అయోడిన్‌ లోప రుగ్మతల నివారణ వారోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.

Iodine deficiency   అయోడిన్‌ లోపాన్ని నివారించాలి
పోస్టర్‌ ఆవిష్కరణలో కలెక్టర్‌ తదితరులు

పార్వతీపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లావాసుల్లో అయోడిన్‌ లోపం నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. గ్లోబల్‌ అయోడిన్‌ లోప రుగ్మతల నివారణ వారోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోడిన్‌ లోపం వల్ల పిల్లల్లో ఎదుగుదల, మేథో వికాస సమస్యలు తలెత్తుతాయన్నారు. గర్భిణులతో పాటు అన్ని వయస్కుల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని వెల్లడించారు. అనారోగ్య సమస్యల నివారణపై విస్తృతంగా అవగాహన కార్య క్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అయోడిన్‌ కలిగిన ఉప్పు వినియోగంతో పై సమస్యలను నివారించొచ్చన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:11 AM