Share News

‘ఫాస్ట్‌ ట్రాక్‌లో విచారణ చేయాలి’

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:18 AM

గిరిజన యువతి ఉషారాణి హత్య కేసును ఫాస్ట్‌ ట్రాక్‌లో విచారణకు సహకరించాలని బార్‌ అసోసియేషన్‌ను ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు.

‘ఫాస్ట్‌ ట్రాక్‌లో విచారణ చేయాలి’
మునిస్వామికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

పాలకొండ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన యువతి ఉషారాణి హత్య కేసును ఫాస్ట్‌ ట్రాక్‌లో విచారణకు సహకరించాలని బార్‌ అసోసియేషన్‌ను ఎమ్మెల్యే విజయచంద్ర కోరారు. అలాగే నిందితుల తరఫున ఎవరూ వాదించవద్దని ఆయన విన్నవించారు. మంగళవారం ఎమ్మెల్యే పంపించిన వినతిపత్రాన్ని టీడీపీ నాయకులు కర్నేన అప్పలనాయుడు, జాడ శ్రీధర్‌, మాచర్ల గోవిందరావు, బొమ్మాళి సుధాకర్‌, మజ్జి నవీన్‌ కుమార్‌.. శ్రీకాకుళం జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూన రాజారావు, పాలకొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పల్లా ముని స్వామికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి భువనేశ్వర్‌, సవిరిగాన తేజేశ్వరరావు, గేదెల కృపారాణి ఉద్దేశపూర్వకం గానే బర్న సీతంపేట గ్రామానికి చెందిన ఉషారాణిని హత్య చేశార న్నారు. ఈ ఘటన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. బాధిత ఉషారాణి కుటుంబం తరఫున సీనియర్‌ న్యాయ వాదులు బృందాన్ని నియమించి ఉచిత న్యాయసహాయం అందించాలన్నారు. దీనిపై శ్రీకాకుళం, పాలకొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజారావు, మునిస్వామి సానుకూలంగా స్పందించారు.

Updated Date - Jun 17 , 2026 | 12:18 AM