జీలుగు కల్లు ఘటనపై విచారణ
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:27 AM
వనకాబడి గ్రామంలో జీలుగు కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆదివారం ఎక్సైజ్ సీఐ నాయుడు, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ఆర్. చంద్రకాంత్, కురపాం ఎస్‌ఐ రాజశేఖరం గ్రామాన్ని సందర్శించారు.
కురుపాం/ గుమ్మలక్ష్మీపురం, జనవరి18 (ఆంధ్రజ్యోతి): వనకాబడి గ్రామంలో జీలుగు కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆదివారం ఎక్సైజ్ సీఐ నాయుడు, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ ఆర్. చంద్రకాంత్, కురపాం ఎస్‌ఐ రాజశేఖరం గ్రామాన్ని సందర్శించారు. జీలుగు కల్లు ఘటనపై విచారించారు. కల్లు శాంపిల్స్ సేకరించారు. పరీక్షల నిమిత్తం విశాఖపట్నం లేబరేటరీకి పంపించారు. మిగిలిన జీలుగు కల్లును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామస్థు లతో మాట్లాడారు. జీలుగు కల్లు సహజ సిద్ధంగా చెట్టు నుంచి లభించినప్పటికీ దానికి చట్టబద్దమైన అనుమతుల లేవన్నారు. తాటి, ఈత కల్లు మాదిరిగా విక్రయించడానికి నిబం ధనలు లేవన్నారు. జీలు గు కల్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.