Share News

దాడిపై దర్యాప్తు

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:07 AM

దగ్గర బంధువేనని నమ్మి అప్పు ఇచ్చిన పాపానికి ఓ మహిళను మాజీ రౌడీషీటర్‌ దుర్భాషలాడుతూ విచక్షణా రహితంగా కొట్టిన ఘటనపై కేసు నమోదు కాగా, రాజాం పోలీసులు ఆదివారం దర్యాప్తు ప్రారంభించారు.

దాడిపై దర్యాప్తు
బాధితురాలిని పరామర్శిస్తున్న మహిళా నాయకురాలు శ్రీవాణి

రాజాం రూరల్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): దగ్గర బంధువేనని నమ్మి అప్పు ఇచ్చిన పాపానికి ఓ మహిళను మాజీ రౌడీషీటర్‌ దుర్భాషలాడుతూ విచక్షణా రహితంగా కొట్టిన ఘటనపై కేసు నమోదు కాగా, రాజాం పోలీసులు ఆదివారం దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌ఐ ఉమా వెంకటేశ్వర్రావు, ఏఎస్‌ఐ రాజశేఖర్‌ తదిత రులు సారధి గ్రామంలోని బాధిత మహిళ నిర్మల ఇంటికి వెళ్లి, ఆ రోజు అసలేం జరిగిందని ఆరా తీశారు. తనపై దాడిచేసిన అడపా శ్రీను, అతని కుమార్తె రమా దేవిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆమె అందించిన సమాచా రాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు అడపా శ్రీను, అతని కుమా ర్తె రమాదేవిపై రాజాం పొలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

చట్టపరంగా శిక్షించాలి

మాజీ రౌడీషీటర్‌, అతని కుమార్తెపై పొలీసులు చట్టపరంగా చర్యలు తీసు కోవాలని మహిళా నాయకురాలు కొయ్యాన శ్రీవాణి డిమాండ్‌ చేశారు. అతనిపై నమోదు చేసిన సెక్షన్లు కఠినతరంగా లేవని ఆమె పేర్కొన్నారు. అతనిపై తిరిగి రౌడీషీట్‌ నమోదు చేయాలని ఆమె పొలీసులను డిమాండ్‌ చేశారు. సారధిలో ఉంటున్న నిర్మలను శ్రీవాణి ఆదివారం పరామర్శించారు.

Updated Date - Apr 13 , 2026 | 12:07 AM