Share News

మద్యం మత్తు.. సిగరెట్‌ పీక

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:09 AM

మద్యం మత్తులో ఓ యువకుడి చేష్టలకు అతడి ఇల్లు దగ్ధమైంది.

మద్యం మత్తు.. సిగరెట్‌ పీక
దగ్ధమవుతున్న ఇల్లు

పార్వతీపురం టౌన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఓ యువకుడి చేష్టలకు అతడి ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో సర్వస్వం కాలి బూడిదైంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని గంటావీధికి చెందిన సయ్యుద్‌ మున్నా బాషా నివాసం ఉంటున్నాడు. అతడితో పాటు తల్లి చాంద్‌బీబీ ఉంటోంది. అయితే బాషా కొన్ని రోజులుగా మద్యం మత్తులో ఉంటున్నాడు. సోమవారం మద్యం మత్తులో ఉన్న బాషా సిగరెట్‌ తాగుతూ దాన్ని ఇంట్లోని దుస్తులపై విసిరేసి బయటకు వెళ్లాడు. దాంతో నిప్పు రాజుకుని దుస్తులతో పాటు ఇంటిలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంట్లోని బాషా తల్లి చాంద్‌బీబీని కుటుంబ సభ్యులు రక్షించారు. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి వీధిన పడిన బాషా తల్లి చాంద్‌బీబీ కుటుంబాన్ని ఎమ్మెల్యే విజయచంద్ర సోమవారం పరామర్శించారు. అదే వార్డులో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన అగ్నిప్రమాద సమాచారాన్ని తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు.

Updated Date - Oct 27 , 2026 | 12:09 AM