Interrogation రోజంతా విచారణ
ABN , Publish Date - May 23 , 2026 | 11:11 PM
Interrogation Throughout the Day సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్‌లో అక్రమాలు జరిగినట్టు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు శనివారం ఉదయమే జిల్లా రిజిస్ర్టార్ పార్వతి సాలూరు కార్యాలయానికి చేరుకున్నారు. రోజంతా ఎటువంటి రిజిస్ర్టేషన్ ప్రక్రియ చేపట్టకుండా ఆమె ఆధ్వర్యంలో విచారణ ప్రక్రియ చేపట్టారు.
‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
సాలూరు, మే 23(ఆంధ్రజ్యోతి): సాలూరు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో ఒక క్రిస్టియన్ సంస్థకు చెందిన భూముల రిజిస్ర్టేషన్‌లో అక్రమాలు జరిగినట్టు ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు శనివారం ఉదయమే జిల్లా రిజిస్ర్టార్ పార్వతి సాలూరు కార్యాలయానికి చేరుకున్నారు. రోజంతా ఎటువంటి రిజిస్ర్టేషన్ ప్రక్రియ చేపట్టకుండా ఆమె ఆధ్వర్యంలో విచారణ ప్రక్రియ చేపట్టారు. ముందుగా వివిధ ఫైల్స్‌ను పరిశీలించారు. డగ్లస్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు సంబంధించి ఫిర్యాదుదారులతో మాట్లాడారు. సీనియర్ అసిస్టెంట్ మూర్తిపై వచ్చిన ఫిర్యాదులు, ఫోన్ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆ సంస్థకు చెందిన భూములను జిల్లా రిజిస్ర్టార్ పరిశీలించారు. ఆ తర్వాత ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ... ‘సాలూరు సబ్‌రిజిస్ర్టార్ కార్యాల యంలో ఎఫ్‌ఏసీగా మూర్తి విధుల్లో ఉన్నప్పుడు పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇక్కడకు వచ్చి విచారణ చేపట్టాం. కొన్ని విషయాలు తెలిశాయి. ఎన్ని సందర్భాల్లో సబ్ రిజిస్ర్టార్ సెలవు పెట్టారు. ఎన్ని సార్లు సీనియర్ అసిస్టెంట్ మూర్తి ఆధ్వర్యంలో అవినితీ నడిచింది? అనే విషయంపై ఇంకా పూర్తి స్ధాయిలో విచారణ చేయాల్సి ఉంది. అన్ని విష యాలనూ ఒకేసారి చెప్పడం సాధ్యం కాదు. సీనియర్ అసిస్టెంట్ మూర్తి ఎఫ్‌ఏసీగా విధులు నిర్వహించినప్పుడు చేసిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి పూర్తిగా విచారణ నిర్వహించి ఉన్నతా ధికారులకు నివేదిక అందిస్తాం. ఆ తర్వాత చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు. ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచరితమైన కథనంపై స్పందిస్తూ .. అదంతా వాస్తవమేనని చెప్పారు.