Share News

Intermediate Classes నేటి నుంచి ఇంటర్‌ క్లాస్‌లు

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:20 AM

Intermediate Classes Begin From Today జిల్లాలో జూనియర్‌ కళాశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు నిర్వహించ నున్నారు.

Intermediate Classes  నేటి నుంచి ఇంటర్‌ క్లాస్‌లు
సాలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

  • ఈనెల 23 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు

సాలూరు రూరల్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జూనియర్‌ కళాశాలలు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు తరగతులు నిర్వహించ నున్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 14 కేజీబీవీలు, మోడల్‌, ఎస్సీ,ఎస్టీ సంక్షేమశాఖలకు చెందిన 18, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు 36 ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 5936 మంది రెగ్యులర్‌, 2849 మంది ఒకేషనల్‌ ప్రథమ ఏడాది విద్యార్థులున్నారు. వారికి నేటి నుంచి ఏప్రిల్‌ 23 వరకు తరగతులు నిర్వహించనున్నారు. కాగా ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మార్చి 23తో పరీక్షలు ముగిశాయి. ఆ తర్వాత వారికి వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. గతేడాది నుంచి మార్పులు చేశారు. 2025- 2026 నుంచి ఎస్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రవేశపెట్టి సీబీఎస్‌ఈ విధానాన్ని అవలంబిస్తున్న నేపథ్యంలో పరీక్షల అనంతరం తరగతులు నిర్వహించి ఆ తర్వాత వేసవి సెలవులు ఇచ్చేలా విద్యాప్రణాళిక రూపొందించారు. ఈ ఇదే ప్రణాళికను 2026- 2027 విద్యాసంవత్సరానికి అమలు చేయనున్నారు. జూనియర్‌ కళాశాలలకు ఏప్రిల్‌ 23 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ కళాశాలలు జూన్‌ 1 నుంచి పునఃప్రారంభమై తరగతులు నిర్వహించనున్నారు. ప్రైవేట్‌ కళాశాలలు ర్యాంకులు, పాస్‌ గ్యారెంటీ, కరపత్రాలు, గోడరాతలు, ప్రసార, ప్రచార ప్రకటనలు ఇవ్వరాదని ఇంటర్మీడియట్‌ బోర్డు ఆదేశించింది.

Updated Date - Apr 01 , 2026 | 12:20 AM