అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు: ఎస్పీ
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:19 AM
పాచిపెంట మండలం చిన చీపురువలసలో చోరీకి పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను తొమ్మిది రోజుల్లో సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.
సాలూరు/రూరల్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండలం చిన చీపురువలసలో చోరీకి పాల్పడిన అంతర్ జిల్లా దొంగల ముఠాను తొమ్మిది రోజుల్లో సాలూరు రూరల్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. సోమవారం సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాచిపెంట మండలం చినచీపురువలసలో ఈ నెల 11న చోరీ జరిగిందన్నారు. ఆ ఘటనలో క్లూస్ టీం ఇచ్చిన ఆధారాలతో సాలూరు పట్టణానికి చెందిన జి.సాయికుమార్, బి.యుగంధర్, ఎ.గణేశ్‌లతో పాటు మరో మైనర్‌ను పోలీసులు పట్టుకున్నారన్నారు. వారిపై సాలూరులో నాలుగు కేసులు, మక్కు వ మండలంలో ఓ కేసు, పాచిపెంట మండలంలో రెండు కేసులు ఉన్నా యన్నారు. దాంతో వారి నుంచి 90 గ్రాముల బంగారం, 30 తులాల వెండి, రూ. 90 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారన్నారు. తొలుత పాచిపెంట మం డలం చినచీపురువలసలో దొంగతనం కేసులో తొలి నిందితుడు సాయి కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మైనర్‌తో పాటు ముగ్గురు నిందితులను గుర్తించామన్నారు. వీరు విజయనగరం జిల్లా రామభద్రపురం, విశాఖ జిల్లా గాజువాక తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్టు అంగీకరించారన్నారు. మొదటి నిందితుడు సాయికుమార్, మైనర్‌పై విజయనగరం జిల్లా మానాపురంలో గంజాయి కేసు సైతం నమోదై ఉందన్నారు. నిం దితులను సత్వరమే పట్టుకున్నందుకు రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్‌ఐ రవీంద్రరాజు, మక్కువ ఎస్‌ఐ వెంకటరమణ, పాచిపెంట ఎస్‌ఐ అర్జున్‌లను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వి.మనీషారెడ్డి ఉన్నారు.