Share News

Inter practicals from today నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:02 AM

Inter practicals from today జిల్లాలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నిఘా నీడలో పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం నుంచి ఫిబ్రవరి 10వ తేది వరకూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకూ రెండు ధపాలు నిర్వహించనున్నారు.

Inter practicals from today నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

నేటి నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

98 కేంద్రాల్లో నిర్వహణ ..

15,370 మంది హాజరు

ప్రతి కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు

విజయనగరం కలెక్టరేట్‌, జనవరి 31(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నిఘా నీడలో పరీక్షలు జరగనున్నాయి. ఆదివారం నుంచి ఫిబ్రవరి 10వ తేది వరకూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకూ రెండు ధపాలు నిర్వహించనున్నారు. 98 కేంద్రాల్లో 15,370 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష కేంద్రానికి అర గంట ముందు హాజరు కావాల్సి ఉంది. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌లను, ప్రాక్టికల్‌ ఎగ్జామినర్స్‌ను నియమించారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18 వరకూ 66 కేంద్రాల్లో జరగనున్నాయి. వీటిని మొదటి సంవత్సరంలో 19,759 మంది, రెండో సంవత్సరంలో 19,278 మంది రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకూ పరీక్షలు జరుగుతాయి.

నిఘా నీడలో పరీక్షలు

జిల్లాలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు సంబంధించి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేశాం. నిఘా నీడలో జరగనున్నాయి. ప్రతి విద్యార్థి పరీక్ష కేంద్రానికి 8.30కు చేరుకోవాలి. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్షలు నిర్వహించాలని చెప్పాం.

- ఎస్‌.తవిటినాయుడు, జిల్లా ఇంటర్‌ విద్య అధికారి

===========

Updated Date - Feb 01 , 2026 | 12:02 AM