Share News

Inter Examinations పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:31 PM

Inter Examinations to Be Conducted in a Strict and Foolproof Manner జిల్లాలో ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23నుంచి జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో జరిగే ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

Inter Examinations   పకడ్బందీగా ఇంటర్‌ పరీక్షలు
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

  • ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

పార్వతీపురం, ఫిబ్రవరి18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్‌ ప్రభాకర్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23నుంచి జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాల్లో జరిగే ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలయ్యేలా చూడాలన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఎవరూ సెల్‌ఫోన్లు తేకూడదని తెలిపారు. ఫ్లైయింగ్‌ , సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించాలని, కేంద్రాల వద్ద జిరాక్స్‌, ఇంటర్‌నెట్‌ సెంటర్లను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష ముగిసే వరకు మూసివేయించాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం ఏర్పాట్లను రోజూ పర్యవేక్షించాలని తెలిపారు.

సీఎస్‌సీ పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, త్వరగా వాటి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఒక వేళ సచివాలయం వద్ద స్థలం అందుబాటులో లేకపోతే ప్రజల సౌకర్యార్థం 50 మీటర్ల పరిధిలో లేదా రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. గ్రామ స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఏఈలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వీఆర్‌వోలు సమన్వయంతో పనిచేసి పనుల్లో ఉన్న అడ్డం కులను వెంటనే తొలగించాలని సూచించారు. నిర్మాణాల పురోగతిని సబ్‌ కలెక్టర్లు పర్యవేక్షిం చాలన్నారు. క్షే త్రస్థాయిలోని సమస్యలపై ఎంపీడీవోలతో చర్చించాలన్నారు. పెండింగ్‌ పను లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

పర్యాటక అభివృద్ధిలో వేగం పెంచాలి

జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనుల వేగం పెంచాలని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి.. నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పర్యాటక రంగం ద్వారా జిల్లా ఆదాయాన్ని పెంచడంతో పాటు పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ముస్తాబు గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడమే కాకుండా వాటిని ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌గా మార్చాలని సూచించారు. ప్రతి పర్యాటక కేంద్రం నుంచి నెలకు కనీసం రూ.10 లక్షలు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాల న్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీతంపేట ఎన్టీఆర్‌ పార్క్‌లో డీఆర్‌డీఏ, జీసీసీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా అద్దె రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలని ఆదేశించారు. పార్వతీపురం, గుమ్మ లక్ష్మీపురం తదితర మండలాల్లోని హిల్‌టాప్‌ ప్రాంతాల్లో స్కైవ్యూ, ట్రెక్కింగ్‌, గిరి ప్రదిక్షణ వంటి అంశాలపై దృష్టిసారించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్లు పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, వైశాలి, డీఆర్వో కె.హేమలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 11:31 PM