Inter Evaluation రేపటి నుంచి ఇంటర్ మూల్యాంకనం
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:35 PM
Inter Evaluation Begins from Tomorrow రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న రంజాన్ సెలవు ప్రకటించన నేపథ్యంలో విద్యాశాఖ ఇంటర్ మూల్యాంకన షెడ్యూల్‌లో స్పల్ప మార్పులు చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మొదటి విడత మూల్యాంకన ప్రక్రియ మార్చి 21న ప్రారంభం కావల్సి ఉంది. అయితే దానిని ఒక రోజు వాయిదా వేసినట్లు డీఐఈవో వై.నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బెలగాం, మార్చి 20(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న రంజాన్ సెలవు ప్రకటించన నేపథ్యంలో విద్యాశాఖ ఇంటర్ మూల్యాంకన షెడ్యూల్‌లో స్పల్ప మార్పులు చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మొదటి విడత మూల్యాంకన ప్రక్రియ మార్చి 21న ప్రారంభం కావల్సి ఉంది. అయితే దానిని ఒక రోజు వాయిదా వేసినట్లు డీఐఈవో వై.నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత వాల్యుయేషన్ ఈ నెల 22న ప్రారంభ మవుతుందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఈ మార్పును గమనించి, నిర్ణీత సమయానికి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.