18 నుంచి 20 వరకు బీమా సంకల్ప్ డ్రైవ్
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:03 AM
బీమా సంకల్ప్ మెగా డ్రైవ్‌ను ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించి రూ.2.5 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని సంకల్పించినట్టు పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ రెడ్డి బాబూరావు అన్నారు.
బొబ్బిలి, ఫిబ్రవరి4 (ఆంధ్రజ్యోతి): బీమా సంకల్ప్ మెగా డ్రైవ్‌ను ఈ నెల 18 నుంచి 20 వరకు నిర్వహించి రూ.2.5 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని సంకల్పించినట్టు పార్వతీపురం పోస్టల్ సూపరింటెండెంట్ రెడ్డి బాబూరావు అన్నారు. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం తపాలా సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పోస్టల్ డివిజన్ పరిధిలో బీమా సంకల్ప్ 3.0 ద్వారా పీఎల్‌ఐ/ఆర్‌పీఐ ప్రీమియం సేకరణ లక్ష్యాలను ప్రతీ ఒక్కరూ సాధించాలన్నారు. పోస్టల్ సేవింగ్స్ బ్యాంకు లక్ష్యాలను మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం సాధించా లన్నారు. అన్ని పోస్టాఫీస్‌ల్లో ఆన్‌లైన్ సేవలను ఎంతో నాణ్యతతో అందిస్తు న్నామన్నారు. త్వరితగతిన పార్శిల్ సర్వీసు, పోస్టల్ సేవలను అందించడంలో ముందున్నామన్నారు. సమావేశంలో బొబ్బిలి పోస్టల్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ప్రదీప్, పార్వతీశం, పార్వతీ పురం, బొబ్బిలి సబ్‌డివిజన్ పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.