Share News

ప్రతి కార్యకర్తకు బీమా సౌకర్యం

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:53 PM

:ఆపదలో ఆదుకునేందుకు టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న ప్రతి ఒక్కరికి బీమాసౌకర్యం కల్పిం చినట్లు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.

ప్రతి కార్యకర్తకు బీమా సౌకర్యం
ఈశ్వరరావు కుటుంబ సభ్యులకు బీమా సొమ్మును అందజేస్తున్న లలితకుమారి

కొత్తవలస, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):ఆపదలో ఆదుకునేందుకు టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న ప్రతి ఒక్కరికి బీమాసౌకర్యం కల్పిం చినట్లు శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. మండలంలోని చిన్నిపాలెం గ్రామానికి చెందిన వనుము ఈశ్వరరావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం విదితమే. ఈశ్వరరావు టీడీపీలో క్రియాశీలక సభ్యత్వం కలిగిఉండడంతో పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు పెట్టిన బీమా పఽథకం కింద ఐదు లక్షల రూపాయలు మంజూర య్యాయి. ఈమేరకు ఈశ్వరరావు కుటుంబ సభ్యులకు కోళ్ల లలితకుమారి, రాంప్రసాద్‌ దంపతులు ఆదివారం చిన్నిపాలెం గ్రామానికి వెళ్లి అంద జేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు, ఐటీశాఖ మంత్రి తమ పార్టీలో ఉన్న కార్యకర్తలను ఆదుకునే ధ్యేయంతో ప్రతి క్రియాశీలక కార్యకర్త కోసం బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ పీవీ రత్నాజీ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, టీడీపీ నాయకులు నక్కరాజు చినరాము, గొంపదుర్గా ఉమేష్‌, సీముసురు పైడిరాజు, వీవీసత్యం, వి.సన్యాసినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 11:53 PM