Share News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:00 AM

జిల్లా కేంద్ర ఆసుపత్రి, చిన మేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రం, రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురు వారం రాష్ట్రస్థాయి సమీక్ష బృందం తనిఖీ చేసింది.

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో తనిఖీలు
చినమేరంగి సీహెచ్‌సీని తనిఖీ చేస్తున్న బృందం

పార్వతీపురం/ జియ్యమ్మవలస, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్ర ఆసుపత్రి, చిన మేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రం, రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురు వారం రాష్ట్రస్థాయి సమీక్ష బృందం తనిఖీ చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎల్‌ ఈపీ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.దేవసాగర్‌, సీహెచ్‌ అండ్‌ ఐ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.సుబ్రహ్మణ్యం బబతో కూడిన బృందం జిల్లాలో పర్యటించింది. ప్రధానంగా జిల్లాలో అందుతున్న వైద్య సేవలు, జాతీయ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమాల అమలు తీరును పూర్తి పరిశీలన చేశారు. అలాగే ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు పనిచేస్తున్నాయా? లేదా?, మందులు కొరత తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నుంచి సేకరించారు. ప్రధానంగా 2027 మార్చి నాటికి నిర్దేశించిన నాణ్యత ధ్రువీ కరణ లక్ష్యాలను చేరడమే లక్ష్యంగా బృందం పర్యటన కొనసాగింది. వారి వెంట డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ నాగభూషణరావు, ఎన్‌సీడీ పీవో డాక్టర్‌ టి.జగన్మోహన రావు, డీఐవో డాక్టర్‌ విజయ్‌మోహన్‌, చినమేరంగి సీహెచ్‌సీ సూపరింటెడెంట్‌ డాక్టర్‌ వాసుదేవరావు ఉన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 01:00 AM