200 ఇళ్లలో తనిఖీలు.. 250 మంది విచారణ
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:15 AM
మండలంలోని జగన్నాఽథపురంలో శని వారం ఉదయం 5.30నుంచి 7.30 వరకు పోలీసులు మెగా కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా డీఎస్పీ గోవిందరావు పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు.
బొబ్బిలి రూరల్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జగన్నాఽథపురంలో శని వారం ఉదయం 5.30నుంచి 7.30 వరకు పోలీసులు మెగా కార్డన్‌సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా డీఎస్పీ గోవిందరావు పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది పోలీసులు గ్రామంలోని 200 ఇళ్లను తనిఖీలు చేసి, 250 మంది స్థానికుల ను విచారించి వివరాలు సేకరించారు.గామంలో మూడుమోటారు సైకిళ్లు, మూడు ఆటో లను సమగ్రంగా తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో నిషేధిత పదార్థాలు, అనుమానాస్పద వ్యక్తిగత సమాచాచం లభించలేదని పోలీసులు తెలిపారు. గ్రామస్థుతో కలిసి గంజాయి, డ్రగ్స్ రహిత సమాజంకోసం పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్ర మంలో సీఐ కె.నారాయణరావు, రూరల్, టౌన్ పోలీసు ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.