స్టీల్‌ప్లాంట్ భూముల పరిశీలన
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:22 AM
మండలంలోని ఎస్ ఎస్‌ఆర్ పేట నుంచి వల్లాపురం వరకు స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం ఉన్న భూములను విజయనగరం జేసీ సేతుమాధవన్, రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్‌తో కలిసి శుక్రవారం పరిశీలించా రు.
గుర్ల, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎస్ ఎస్‌ఆర్ పేట నుంచి వల్లాపురం వరకు స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం ఉన్న భూములను విజయనగరం జేసీ సేతుమాధవన్, రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్‌తో కలిసి శుక్రవారం పరిశీలించా రు. మ్యాపు ఆధారంగా ఆ భూముల వివరాలను రెవె న్యూ శాఖాధికారులకు అడిగి తెలుసుకున్నారు. క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
సుందరపేటలో..
భోగాపురం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జాతీయ రహ దారిని ఆనుకుని ఉన్న భోగాపురం పంచాయతీ సుం దరపేట భూములను రెవెన్యూ అధికారులు శుక్రవారం పరిశీలించారు. మ్యాప్ ఆధారంగా ఈ భూములను పరిశీలించి, పలు వివరాలపై చర్చించారు. విషయం తెలుసుకున్న స్థానిక రైతులు అక్కడికి చేరుకున్నారు. భూములు ఇవ్వబోమని నిరసనలు చేస్తున్నా అధికా రులు ఈ విధంగా భూముల పరిశీలనకు రావడం దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల పరిశీలనలో జేసీ సేతుమాధవన్, ఆర్డీవో సుధాసాగర్, ఆర్‌ఐ వేణుగోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.