పెదకాదలో షేడ్‌నెట్ యూనిట్ల పరిశీలన
ABN , Publish Date - Nov 26 , 2026 | 12:48 AM
మండలంలోని పెదకాదలో ఏర్పాటు చేసిన షేడ్‌నెట్ యూనిట్లను కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, డీఆర్‌డీఏ-వెలుగు పీడీ శ్రీని వాస్‌పాణిలు బుధవారం పరిశీలించారు.
తమ అనుభవాలను కలెక్టర్ రామసుందర్‌రెడ్డితో పంచుకున్న రైతులు
దత్తిరాజేరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదకాదలో ఏర్పాటు చేసిన షేడ్‌నెట్ యూనిట్లను కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, డీఆర్‌డీఏ-వెలుగు పీడీ శ్రీని వాస్‌పాణిలు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా షేడ్ నెట్ల ద్వారా పంటలు సాగుచేస్తున్న రైతులతో మాట్లాడారు. ఒక్కో షేడ్‌నెట్ ఏర్పాటుకు రైతులు వెచ్చించిన మొత్తం, ప్రభుత్వంద్వారా అందిన సబ్సిడీ వివరాలను అడిగితెలుసుకున్నారు. షేడ్ నెట్‌లో సాగుచేస్తున్న పంటలవివరాలు, పంటల విక్రయం ద్వారా ఇప్పటివరకు వచ్చి న ఆదాయం, రైతులకు లభించిన లాభాలు గురించి ఆరాతీశారు. షేడ్‌నెట్‌లో సాగు చేస్తున్న పంటల వివరాలు, విక్రయంద్వారా ఇప్పటివరకు వచ్చినఆదాయం, రైతులకు లభించిన లాభాల గురించిరైతులతో మాట్లాడారు. రైతులు తమఅనుభవాలను, ఎదు ర్కొంటున్న సమస్యలను రైతులు కలెక్టర్‌తో పంచుకున్నారు. కలెక్టర్ వెంట నాబార్డు ఏజీఎం నాగార్జున, జిల్లా హార్టికల్చర్ హెచ్‌ఓ దీప్తి, తహసీల్దార్ సురేష్, డీపీఎం రాజ్‌కుమార్, ఏపీఎం విశ్వేశ్వరరావు, ఏపీఎం అనూరాధ, ఖేతి సంస్థ ప్రతినిధి విజ య్, సీసీ నాగరాజు, ఐఎఫ్‌సీ యాంకర్ ప్రదీప్తి, సంబంధిత వీఓఏ ఉన్నారు.