రిజర్వాయర్ల పరిశీలన
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:11 AM
రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్‌తో పాటు కురుపాం మండలంలో గుజ్జువాయి రిజర్వాయర్లను ప్యానల్ ఆఫ్ ఎక్స్‌ఫర్ట్స్ చైర్మన్ కె.రామభద్రరాజు, సభ్యులు కె.శ్రీనివాస్‌బాబు, డి.కృష్ణారావు బుధవారం పరిశీలించారు.
జియ్యమ్మవలస, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్‌తో పాటు కురుపాం మండలంలో గుజ్జువాయి రిజర్వాయర్లను ప్యానల్ ఆఫ్ ఎక్స్‌ఫర్ట్స్ చైర్మన్ కె.రామభద్రరాజు, సభ్యులు కె.శ్రీనివాస్‌బాబు, డి.కృష్ణారావు బుధవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా రిజర్వాయర్ల నిర్మాణ స్థితి, భద్రతా చర్యలతో పాటు అవసరమైన మెరుగుదలపై వివరణాత్మక పరిశీలన చేశారు. అలాగే రిజర్వాయర్ల భద్రతకు సంబంధించి తగిన సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా రామభద్రరాజు మాట్లాడుతూ రిజర్వాయర్ల భద్రతపై కమిటీ నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. పరిశీలనలో కురుపాం సబ్ డివిజన్ డీఈఈ డి.రవికుమార్, హైడ్రాలజీ డీఈఈ నర్మదా పట్నాయక్, ఏఈలు బి.శంకరరావు, జె.వినయ్‌కుమార్, సుధీర్ నెహ్రూ, మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.