Peddagedda పెద్దగెడ్డ జలాశయం పరిశీలన
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:00 AM
Inspection of Peddagedda Reservoir : పెద్దగెడ్డ జలాశయాన్ని కేంద్ర జల వనరుల ఇంజనీరింగ్ అధికారులు విజయ్, ప్రవీణ్ తదితరులు బుధవారం సందర్శించారు. రైతులకు సూక్ష్మ, బిందు సేద్యం ద్వారా సాగునీరు అందించేందుకు చేపట్టనున్న నూతన ప్రాజెక్టు పనులపై క్షే త్రస్థాయిలో పరిశీలించారు.
పాచిపెంట రూరల్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): పెద్దగెడ్డ జలాశయాన్ని కేంద్ర జల వనరుల ఇంజనీరింగ్ అధికారులు విజయ్, ప్రవీణ్ తదితరులు బుధవారం సందర్శించారు. రైతులకు సూక్ష్మ, బిందు సేద్యం ద్వారా సాగునీరు అందించేందుకు చేపట్టనున్న నూతన ప్రాజెక్టు పనులపై క్షే త్రస్థాయిలో పరిశీలించారు. పైపులైన్ నిర్మాణం, పనుల అమలు విధానంపై స్థానిక సిబ్బందితో చర్చించారు. రైతులకు గరిష్ఠ ప్రయోజనం కలిగేలా సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. అనంతరం రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో డీఈ సురేష్, జేఈ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.