Share News

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన

ABN , Publish Date - Oct 22 , 2026 | 12:39 AM

స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను బుధవారం సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌ పరిశీలించారు.

ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన
అధికారులతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌

పాలకొండ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను బుధవారం సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌ పరిశీలించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అధికారులతో మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, పోలింగ్‌ బాక్సుల లభ్యత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లును ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రతిపాదిత స్ర్టాంగ్‌ రూమ్‌ను పరిశీలించారు. అక్కడ పటిష్టమైన భ ద్రత ఏర్పాట్లు, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. అనంతరం బెజ్జి గ్రామంలోని పోలింగ్‌ కేం ద్రాన్ని సందర్శించి ఓటర్లకు తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, ర్యాంపులు వంటి సౌకర్యాలపై ఆరా తీశారు.

Updated Date - Oct 22 , 2026 | 12:39 AM