CWC Pipeline Works సీడబ్ల్యూసీ పైపులైన్ పనులపై ఆరా
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:22 AM
Inspection of CWC Pipeline Works పెద్దగెడ్డ జలాశయం వద్ద రూ.73.55 కోట్లతో నిర్మిస్తున్న సీడబ్ల్యూసీ ప్రాజెక్టు పైపులైన్ అభివృద్ధి పనులపై కేంద్ర జల వనరుల శక్తి బృందం ఆరా తీసింది. మంగళవారం సాయంత్రం ఆ బృంద సభ్యులు పనులను పరిశీలించారు. ప్రస్తుతం పనుల పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పాచిపెంట రూరల్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): పెద్దగెడ్డ జలాశయం వద్ద రూ.73.55 కోట్లతో నిర్మిస్తున్న సీడబ్ల్యూసీ ప్రాజెక్టు పైపులైన్ అభివృద్ధి పనులపై కేంద్ర జల వనరుల శక్తి బృందం ఆరా తీసింది. మంగళవారం సాయంత్రం ఆ బృంద సభ్యులు పనులను పరిశీలించారు. ప్రస్తుతం పనుల పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టాలని సూచించారు. అనంతరం పెద్దగెడ్డ ఎస్‌ఈ ప్రదీప్ మాట్లాడుతూ.. పాచిపెంట, రామభద్రపురం మండలాల్లో 19 గ్రామాల్లోని 7,500 ఎకరాలకు పైపులైన్ ద్వారా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇది పూర్తయితే రైతులు ఏడాదిలో రెండు పంటలు పండించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ పరిశీలనలో కేంద్ర జల వనరుల శక్తి బృంద సభ్యులు డైరెక్టర్ సతీష్, డిప్యూటీ డైరెక్టర్ ప్రవీణ్, అసిస్టెంట్ డైరెక్టర్ మనోహర్ , డీఈ శ్రీనివాసరావు, జేఈలు సాగర్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.