ఫీల్డ్ అసిస్టెంట్‌పై విచారణ
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:18 AM
మండల కేంద్రంలో ఉపాధి పనుల ఫీల్డ్ అసిస్టెంట్ కె.తవితమ్మపై శనివారం పంచాయతీ కార్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు.
పాచిపెంట రూరల్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఉపాధి పనుల ఫీల్డ్ అసిస్టెంట్ కె.తవితమ్మపై శనివారం పంచాయతీ కార్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. వారానికి రూ.200 చొప్పున వేతనదారుల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని కొంతమంది వేతనదారులు ఎంపీడీవో బీబీజే పా త్రోకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. దాంతో శనివారం ఎంపీడీవోతో పాటు డిప్యూటీ ఎంపీడీవో మల్లేశ్వరరావు, ఈసీ అలువాడ గోపాలకృష్ణ.. ఫిర్యాదుదారులు, ఫీల్డ్ అసిస్టెంట్ తవితమ్మను రప్పించి విచారణ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆధారాలను వేతనదారులు అధికారులకు చూపించారు. ఇదిలా ఉండగా తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పుకొచ్చారు. దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఎంపీడీవో పాత్రో విలేకరులకు తెలిపారు.