వినతులు పరిష్కరించేందుకు చొరవ: కర్రోతు
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:28 AM
22
భోగాపురం, జనవరి9(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే వినతులు పరిష్కారానికి ప్రత్యేక చోరవ తీసుకుంటామని మార్క్‌ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు తెలిపారు. పోలిపల్లి గ్రామంలో శుక్రవారం ప్రజాదర్భార్ నిర్వహించి ప్రజలనుంచి వినతులు స్వీకరించారు.పోలిపల్లిలో భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన బాధితులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.76114 విలువగల రెండు చెక్కులను అందజేశారు.అలాగే గుడివాడలో రీసర్వే డీటీ రవి తదిత రులతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీచేశారు.