Share News

Infrastructure Development మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

ABN , Publish Date - May 29 , 2026 | 10:49 PM

Infrastructure Development Is the Main Objective పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో ప్రధాన సమస్యలు తెలుసుకుని వాటిు పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. శుక్రవారం కొంకడివరం పంచాయతీ సీతారాంపురంలో ‘ఒక రోజు ఒక నియోజకవర్గం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Infrastructure Development  మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
వినతులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, ప్ర‌భుత్వ విప్ జ‌గ‌దీశ్వ‌రి

గరుగుబిల్లి, మే29(ఆంధ్రజ్యోతి): పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. గ్రామస్థాయిలో ప్రధాన సమస్యలు తెలుసుకుని వాటిు పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. శుక్రవారం కొంకడివరం పంచాయతీ సీతారాంపురంలో ‘ఒక రోజు ఒక నియోజకవర్గం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన పరిపాలన అందించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం ప్రారంభించామని కలెక్టర్‌ తెలిపారు. తాగునీరు, రహదారి మరమ్మతులు, పింఛన్లు, విద్యుత్‌, భూసమస్యలపై అధికంగా వినతులు వచ్చాయన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వెల్లడించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ఐదు మండలాలను అభివృద్ధి బాటలో తీసుసుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామారావు, తహసీల్దార్‌ పి.బాల, ఎంపీడీవో జి.పైడితల్లి, కార్పొరేషన్‌ డైరెక్టర్లు టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 10:49 PM