Share News

In-face recoganation attendance for B.Ed. students from now on. బీఈడీ విద్యార్థులకు ఇక ముఖ హాజరు

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:28 PM

In-face recoganation attendance for B.Ed. students from now on. బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌( బిఈడి) కోర్సు చదివే విద్యార్థులు, అధ్యాపకులకు ఇక నుంచి ముఖ హాజరు అమలు చేయాలంటూ ఉన్నత విద్య శాఖ కమిషనర్‌ డాక్టరు నారాయణ భరత్‌గుప్తా ఆదేశించారు.

In-face recoganation attendance for B.Ed. students from now on. బీఈడీ విద్యార్థులకు   ఇక ముఖ హాజరు

బీఈడీ విద్యార్థులకు

ఇక ముఖ హాజరు

ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

జిల్లాలో 30 కాలేజీల్లో అమలుకు చర్యలు

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌( బిఈడి) కోర్సు చదివే విద్యార్థులు, అధ్యాపకులకు ఇక నుంచి ముఖ హాజరు అమలు చేయాలంటూ ఉన్నత విద్య శాఖ కమిషనర్‌ డాక్టరు నారాయణ భరత్‌గుప్తా ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 బీఈడీ కాలేజీలు ఉన్నాయి వీటిల్లో 2200 సీట్లు ఉన్నాయి. వీరంతా ఇప్పటివరకూ సాధారణ పద్ధతిలో రిజిస్టర్‌లో హాజరు నమోదు చేసుకుంటూ వచ్చారు. ఇక నుంచి ముఖ హాజరు వేయాల్సి ఉంది. దీనివల్ల బోగస్‌ హాజరును అరికట్టవచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి బీఈడీ కాలేజీలు గాడి తప్పాయి. చాలా మంది విద్యార్థులు కాలేజీలకు వెళ్లకుండా పరీక్షలకు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు కొన్ని కాలేజీలను అధ్యాపకులు లేకుండా కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించకపోవడంతో ఈ కోర్సుపై విద్యార్థులు పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఒడిశా రాష్ట్రానికి చెందిన విద్యార్థులే జిల్లాలో ఉన్న బీఈడీ కాలేజీల్లో చేరేవారు. ఆ రాష్ట్రంలోని ఉపాధ్యాయ పోస్టులు పొందేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మెగా డీఎస్సీ నిర్వహించడంతో మళ్లీ బీఈడీ, డైట్‌ కోర్సులకు ఆదరణ పెరిగింది. గతంలో జరిగిన లోపాలను అరికట్టాలని ఉన్నత విద్యా కమిషనర్‌ ముఖ హాజరును అమలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అన్ని కాలేజీల్లో ప్రతిరోజు అధ్యాపకులు, విద్యార్థులు ముఖ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ముఖ హాజరు ప్రకారమే విద్యార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి.

======

Updated Date - Aug 08 , 2026 | 11:28 PM