Share News

Industries in 700 acres 700 ఎకరాల్లో పరిశ్రమలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:13 AM

Industries in 700 acres జిల్లాలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు 700 ఎకరాలు గుర్తించామని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి చెప్పారు. పరిశ్రమల శాఖ అధికారులతో తన చాంబర్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Industries in 700 acres 700 ఎకరాల్లో పరిశ్రమలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

700 ఎకరాల్లో పరిశ్రమలు

జిల్లాలో ఏర్పాటుకు ప్రతిపాదనలు

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు 700 ఎకరాలు గుర్తించామని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి చెప్పారు. పరిశ్రమల శాఖ అధికారులతో తన చాంబర్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన వివిధ పరిశ్రమలకు కావాల్సిన భూసేకరణ అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పూసపాటిరేగలో టాయిస్‌, ఫర్నేచర్‌, ఫుట్‌వేర్‌ పరిశ్రమల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాల్సి ఉందన్నారు. రెల్లివలస గ్రామంలో సుమారు 35 ఎకరాల్లో హెల్త్‌ హబ్‌ కూడా ఈ ప్రతిపాదనలో పొందుర్చాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి సాధించేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా అనుకూలంగా ఉందని, బాడంగి మండలంలో 213 ఎకరాలు, గరివిడి మండలంలో 219 ఎకరాలు, ఎస్‌.కోట మండలంలో 155 ఎకరాలను ఇందుకోసం గుర్తించామన్నారు. సమావేశంలో జేసీ సేతు మాధవన్‌, సీపీవో బాలాజీ, పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ కరుణాకర్‌ తదితరులు ఉన్నారు.

మరో రెండు ఎంఎస్‌ఎంఈ పార్కులు

చీపురుపల్లి, రాజాం నియోజవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని అదే విధంగా జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారక తీర్థసాగర్‌ ప్రాజెక్టులతో పాటు తోటపల్లి, జాతీయ రహదారి 516(బి) , రైల్వే లైన్ల విస్తరణ తదితర అంశాలపై సమీక్షించారు. వీటిన్నింటికీ భూసేకరణ, ఇతర రెవెన్యూ పరమైన అంశాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి, భూసేకరణ ప్రక్రియ చేపట్టాలన్నారు. బొబ్బిలి ఎంఎస్‌ఎంఈ పార్కు సమస్యను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో జేసీ సేతు మాదవన్‌, డీఆర్‌వో మురళి, ఆర్‌డీవోలు కీర్తి, సత్యవాణి, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ కళావతి ఉన్నారు.

ఉత్తమ పురస్కారానికి కలెక్టర్‌

ఓటర్ల నమోదులో అనుసరించిన విధానానికి గుర్తింపు

విజయనగరం కలెక్టరేట్‌, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఓటు నమోదులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డికి రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు - 2025కు కలెక్టర్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి మంగళవారం అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. జిల్లాలో ఓటర్ల జాబితా రూపకల్పన, నమోదు ప్రక్రియలో ఆయన అనుసరించిన అత్యుత్తమ విధానాలను గుర్తించి ఈ అవార్డును ప్రకటించారు. ఉత్తమ బీఎల్‌వోగా బొండపల్లి మండలం పోలింగ్‌ బూత్‌ 161కి సంబంధించి ఎల్‌.సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈనెల 25న విజయవాడలో తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఈ అవార్డులను అందుకోనున్నారు.

Updated Date - Jan 21 , 2026 | 12:13 AM