Share News

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:33 AM

తాటిచెట్టు పడి గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కొత్తవలస, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): తాటిచెట్టు పడి గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా, కె.కోటపాడు మండలం, గొట్లాం గ్రామానికి చెందిన కొట్యాడ సూరిబాబు(40) ఈనెల 27వ తేదీ సాయంత్రం కొత్తవలస పంచాయతీ చీపురువలస-గొట్లాం గ్రామాల సరిహద్దులో ఉన్న పశువుల పాకలో పశువులను కట్టి, తిరిగి వెళ్లిపోతుండగా.. విపరీతంగా వీచిన ఈదురుగాలులకు ఓ తాటిచెట్టు సూరిబాబు మీద పడిపోయింది. ఈ సంఘటనలో సూరిబాబు తీవ్రంగా గాయపడ్డంతో గొట్లాం గ్రామస్థులు వెంటనే కోటపాడులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్సపొందుతూ శుక్రవారం సాయంత్రం ఆయన మృతిచెందాడు. ఆ గ్రామస్థులు దీనిపై కొత్తవలస తహసీల్దార్‌ రామలక్ష్మికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె సంఘటన జరిగిన ప్రాంతం కొత్తవలస మండల పరిధిలోకి వస్తుందా.. కె.కోటపాడు మండల పరిధిలోకి వస్తుందా.. అనే విషయాన్ని ఆర్‌ఐ షణ్ముఖ, గ్రామ సర్వేయర్‌, రెవెన్యూ కార్యదర్శి ద్వారా విచారణ చేయించారు. ఈ ప్రాంతం కొత్తవలస మండల పరిధిలోకి వస్తుందని గుర్తించారు. దీంతో ఆమె స్థానిక సీఐ టీవీ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 31 , 2026 | 12:33 AM