బస్సుల రాకపోకలకు సమయం పెంచండి
ABN , Publish Date - Mar 09 , 2026 | 11:59 PM
ఎస్.కోట-విశాఖ రూట్‌లో బస్సుల రాకపోకలకు సమయం పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల సంఘం స్థానిక డిపో సెక్రటరీ కొల్లి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ఉద్యోగుల నిరసన
శృంగవరపుకోట, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఎస్.కోట-విశాఖ రూట్‌లో బస్సుల రాకపోకలకు సమయం పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల సంఘం స్థానిక డిపో సెక్రటరీ కొల్లి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమ వారం ఎస్.కోట డిపో గేటు వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరస న తెలిపారు. ఎస్.కోట నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు గంటన్నర సమయం సరిపోవడం లేదని, సుమారు రెండు గంటల సమయం పడుతుందని పేర్కొ న్నారు. స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ కారణంగా ప్రతి బస్సు అరగంట ఆలస్యం అవు తుండడంతో డ్రైవర్, కండక్టర్లకు విశ్రాంతి ఉండడం లేదని తెలిపారు. అరకు ఘాట్ రోడ్డులో పరిమితికి మించి ప్రయాణికులకు ఎక్కిస్తుండడంతో ప్రమా దాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ- అరకు- కించు మండ బస్సు వేళల్లో తేడాలను సరిచేయాలని కోరారు. డీలక్స్, కొన్ని పల్లె బస్సుల కండిషన్ బాగోకపోవడంతో మార్గమధ్యంలో ఆగిపోతున్నాయన్నారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాటుపడుతున్న ఆన్ కాల్ డ్రైవర్‌ను కొనసాగించడాన్ని తప్పుపట్టారు.