Share News

చట్టాలపై అవగాహన పెంచుకోండి

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:23 AM

చట్టాలపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని పార్వతీపురానికి చెందిన రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్‌.దామోదరరావు అన్నారు.

చట్టాలపై అవగాహన పెంచుకోండి
మాట్లాడుతున్న న్యాయాధికారి దామోదరరావు

గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 14 ( ఆంధ్ర జ్యోతి): చట్టాలపై అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని పార్వతీపురానికి చెందిన రెండో అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్‌.దామోదరరావు అన్నారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలో రెవెన్యూ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహిం చారు. పార్వతీపురం, కురుపాం మండల న్యాయ సేవా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అప్‌ హోల్ట్‌ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన బాల్య వివాహ్‌ విముక్తి రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖకు చెందిన 21 చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతీ శనివారం జిల్లా లోని అన్ని మండలాల్లో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తామ న్నారు. కార్యక్రమంలో తహ సీల్దార్‌ ఎన్‌.శేఖరం, ఎంపీడీవో శ్రీనివాసరావు, న్యాయవాదులు పి.మోహన్‌మురళి, గొర్లి వెంకటరావు, ఎ.లక్ష్మీపతిరాజు, వి.శ్రీనివాసరావు, సీఐ బి.హరి, ఎస్‌ఐ శివప్రసాద్‌, లోక్‌ అదాలత్‌ సభ్యుడు గొటారి వెంకటరావు, అంధవరపు కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2026 | 12:23 AM